Shivani – Shivathmika: తగ్గేదేలే అంటున్న అక్కా చెల్లుళ్లు.. తమిళంలో వరుసకట్టి సినిమాలు

Shivani – Shivathmika: ప్రస్తుతం ఉన్న సినిమా రంగంలో హీరోల కొడుకులు అని పిలవడం అనేది సర్వసాధారణ విషయం. కానీ, హీరోల కూతుర్లు అని పిలవడం అనేది చాలా అరుదైన విషయం. ప్రస్తుతం ఉన్న కాలంలో కొడుకులతో పాటు కూతుర్లు కూడా సమానంగా సినిమా వారసత్వాన్ని అందుకుంటున్నారు. వారిలో ముఖ్యంగా వినిపించే పేరులు మెగా ఫ్యామిలీ నుండి నిహారిక, మంచు ఫ్యామిలీ నుండి మంచు లక్ష్మి, అలాగే ఇప్పుడు రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక కూడా నటన వైపు అడుగులు వేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక నటించిన సినిమాలు అతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సినిమా పరంగా చెప్పుకోవాలంటే వీళ్లిద్దరికీ టాలీవుడ్ లో అంత క్రేజ్ లేదు. ఇదిలా ఉంటే తమిళనాట వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. వీళ్లిద్దరికీ తమిళంలో అవకాశాలు రావడం గొప్ప విశేషం అయితే.. వీళ్లిద్దరు నటించిన సినిమాలు రెండు వారాల వ్యవధిలో తమిళనాట విడుదల అవుతున్నాయి.

తమిళంలో శివాత్మిక కథానాయికగా పరిచయం కాబోతున్న చిత్రం ‘ఆనందం విలయాడుం వీడు’ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కాబోతుంది.ఈ చిత్రంలో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శివాత్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇంకోవైపు శివాని తమిళంలో ‘అన్బరివు’ అనే సినిమాతో తమిళనాట తెరంగేట్రం చేయబోతుంది. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు, హీరో హిప్ హాప్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. శివాని మోడర్న్ అమ్మాయిగా పొట్టి డ్రెస్సుల్లో హాట్ లుక్స్ తో మెరవబోతుంది. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న హాట్ స్టార్ ద్వారా విడుదల కాబోతుంది. అయితే శివాని మూడో చిత్రం కూడా ఓటీటీ బాటే పట్టడం విశేషంగా చెప్పుకోవాలి‌. రాబోయే కాలంలో ఈ అక్కచెల్లెళ్ళు తమిళనాటనా స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకు ఉంటారో లేదో చూడాలి మరి.