Shiva Jyothi: వాడి బ్రతుకు తెరువు కోసం నాపేరు వాడుకున్నాడు….అన్వేష్ కు ఇచ్చి పడేసిన శివ జ్యోతి!

Shiva Jyothi: శివ జ్యోతి పరిచయం అవసరం లేని పేరు. తీన్మార్ వార్తల ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతో మందిని ఆకట్టుకున్న శివ జ్యోతి అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా న్యూస్ రీడర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న శివజ్యోతి తిరిగి ఎలాంటి న్యూస్ ఛానల్లోకి అడుగుపెట్టకుండా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన కెరియర్ కొనసాగిస్తున్నారు.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో శివ జ్యోతి తన భర్త గంగూలీతో కలిసి బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుమ హోస్టుగా వ్యవహరిస్తున్న సుమ అడ్డా కార్యక్రమంలో భాగంగా 3 బుల్లితెర జంటలు హాజరై సందడి చేశారు.

ఇక సుమ కార్యక్రమం అంటే ఎంతో వినోదం ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ఎప్పటిలాగే సుమ వీరందరి చేత ఆటపాటలతో అందరిని సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సుమ శివ జ్యోతిని ఒక ప్రశ్న వేశారు. మీ గురించి ఏదైనా అలిగేషన్స్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు శివ జ్యోతి కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు.

Suma Adda Latest Promo - 22nd June 2025 in Etv Telugu | Ganguly, Sivajyothi, Jai Dhanush, Keerthi

ఈ విషయం గురించి నేను చాలా సీరియస్ గానే సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను అక్క అంటూ… వాడు బతకడం కోసం నాపై అలిగేషన్స్ చేస్తున్నాడు.. నేను హైదరాబాద్ లోనే ఉంటాను ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఈమె సవాల్ విసిరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే శివ జ్యోతి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించే మాట్లాడారని స్పష్టమవుతుంది. ఈయన బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అలాగే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వారందరి పేర్లు చెబుతూ వీడియోలను బయట పెట్టడంతో పెద్ద వివాదం చెలరేగింది అయితే అందులో శివజ్యోతి కూడా బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేశారంటూ అన్వేష్ తెలిపారు. దీంతో ఈమె అన్వేష్ కు ఇలా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.