‎Shilpa Shetty: రెస్టారెంట్‌ క్లోజ్.. అసలు విషయం చెప్పేసిన శిల్పా శెట్టి.. అసలేం జరిగిందంటే!

‎Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. అయితే అందుకు గల కారణం తన రెస్టారెంట్ ని మూసివేస్తున్నట్లు ప్రకటన చేయడం. ఈ విషయం అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇదే విషయం సంచలనంగా మారింది. అయితే నటి శిల్పా శెట్టి తన రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అందుకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

‎ తనకు ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్లు కూడా చేశారు. కొంతమంది రెస్టారెంట్ క్లోజ్ అవ్వడానికి కారణం ఇవే అంటూ కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసారు. కాగా ముంబైలోని బాంద్రాలో సుమారు పదేళ్ల క్రితం తొలి రెస్టారెంట్‌ బాస్టియన్‌ ను ప్రారంభించారు శిల్పా శెట్టి. అయితే మొదటి బ్రాంచ్‌నే క్లోజ్‌ చేస్తున్నట్లు చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా ఆమె ఒక వీడియోతో రియాక్ట్‌ అయ్యారు. బాస్టియన్ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వేల ఫోన్స్‌ వస్తున్నాయి.



‎అయితే దానిని పూర్తిగా మూసివేయడం లేదు అని ఆమె క్లారిటీ ఇచ్చింది. బాంద్రాలోని బాస్టియన్‌ రెస్టారెంట్‌ మాకు రూట్‌ లాంటింది. ఒక చెట్టుకు ఫలాలు ఎలా లభిస్తాయో ఇప్పుడు బాస్టియన్‌ కూడా మాకు కొత్త ఫలాన్ని అందించనుంది. ఇదే ప్రదేశంలో అమ్మకై పేరుతో దక్షిణ భారతదేశ వంటకాలు అందించనున్నాము. నా మూలాలకు సంబంధించిన మంగళూరు వంటకాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. మీకు ఇష్టమైన బాస్టియన్ కూడా ఉంటుంది. బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో జుహు ప్రాంతంలో ప్రారంభించబోతున్నాము. కాబట్టి బాస్టియన్‌ క్లోజ్‌ చేశాం అనే ప్రచారంలో నిజం లేదు. నా సోదరుడు, భాగస్వామి రంజీత్ బింద్రా వీటికి CEOగా ఉన్నారు. ఇవన్నీ అతని ఆలోచన నుంచి వచ్చిన మంచి నిర్ణయాలు. బాంద్రాలో దక్షిణ భారతద వంటకాలు అక్టోబర్‌ నెలలోనే ప్రారంభమవుతాయి అని ఆమె క్లారిటీ ఇచ్చింది శిల్పా శెట్టి.