కిర్రాక్ ఆర్పీ నిజస్వరూపం బయటపెట్టిన షేకింగ్ శేషు.. సినిమా ప్రారంభం కాకుండానే లక్షలు ఖర్చు చేశాడు?

జబర్దస్త్ ద్వారా కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందిన వారిలో షేకింగ్ శేషు కూడా ఒకరు. షేకింగ్ శేషు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జబర్దస్త్ గురించి జబర్దస్త్ యాజమాన్యం గురించి కిరాక్ పార్టీ చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని శేషు వెల్లడించాడు. ఇలా అన్నం పెట్టిన సంస్థని అవమానించడం సరైన పద్ధతి కాదు అంటూ శేషు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా గతంలో కిర్రాక్ ఆర్పి చేసిన కొన్ని పనుల గురించి శేషు సంచలన నిజాలు బయటపెట్టాడు.

గతంలో కిర్రాక్ ఆర్పీ తమ ఊరి నుండి ఒక వ్యక్తిని తీసుకువచ్చి సినిమా తీస్తానని చెప్పి అతనిని భారీగా మోసం చేశాడంటూ శేషు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా తీస్తానని అతనిని నమ్మించి సినిమా మొదలు పెట్టకుండానే 20 లక్షల రూపాయలు ఖర్చు చేయించాడని, ఆ ఖర్చులు భరించలేక ఆ నిర్మాత సినిమా నుండి తప్పుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆర్పీ సినిమా ఆఫీస్ కోసం నెలకు ఏకంగా 50000 అద్దె కోసమే ఖర్చు చేశాడని శేషు వెల్లడించాడు. సినిమా ప్రారంభం కాకముందే ఇలా 20 లక్షలు ఖర్చు చేయటంతో ఆ నిర్మాత ఆర్పీ మీద కూడా ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశాడని శేషు వెల్లడించాడు.

ఆర్పీ ఒక వెధవ అని .. వైజాగ్ లో ఒక మారు మూల పల్లె నుండి రెండు సంవత్సరాల క్రితం ఆ అమ్మాయిని తీసుకువచ్చి ఇప్పుడు ఆమెని నిశ్చితార్థం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆర్పీ ఎవరో ఇంటీరియర్ డిజైనర్ ఇంటిని తన ఇంటికి అందరికీ చెప్పుకుంటూ హోం టూర్ వీడియోలు చేసి డబ్బు సంపాదిస్తూ జనాలను పిచ్చివాల్లని చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ గురించీ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పీ చెప్పినవన్నీ అపద్ధాలే అంటూ శేషు చెప్పుకొచ్చాడు.