One Wife- Two Husbands: అందమైన మహిళకి ఇద్దరు భర్తలు.. నా భార్యంటే.. నా భార్య‌ని భ‌ర్త‌ల గొడ‌వ‌!

One Wife- Two Husbands: సాధారణంగా ఒక భర్తకు ఇద్దరు భార్యలు ఉండటం మనం చూసాము ఆ భర్త కోసం ఇద్దరు భార్యలు గొడవ పడటం కూడా మనం చూస్తూ ఉంటాము. కానీ హన్మకొండ టీచర్స్​‍ కాలనీకి చెందిన ఒక మహిళ కోసం ఇద్దరూ తను నా భార్య అంటే నా భార్య అని గొడవ పడుతూ ఏకంగా పోలీస్స్టేషన్ మెట్లెక్కిన పరిస్థితి ఎదురయింది.ఇలా ఒక భార్య ఇద్దరు భర్తలు ఉన్నారన్న విషయం తెలిసిన పలువురు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

హన్మకొండ టీచర్స్​‍ కాలనీ -2 లో నివసించే లంకా శశికాంత్‌ (42) అనే వ్యక్తికి ఖాజీపేట్‌కు చెందిన దుర్గా సుశీల ఉరఫ్‌ నాగసాయి వెంకట దుర్గా సత్యాదేవి (35)తో పెద్దల సమక్షంలో వివాహం చేశారు వీరికి 13 సంవత్సరాల కొడుకు 10 సంవత్సరాల కూతురు ఉన్నారు. ఇలా ఇంట్లో ఉన్న వీరి జీవితంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. గత ఆగస్టు నెలలో తన భార్య సత్య దేవి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వీరి కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎన్నో చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. ఈమె ఇంటి నుంచి వెళ్తున్న సమయంలో 10 తులాల బంగారు 25 తులాల వెండి కొంత డబ్బును తీసుకువెళ్ళింది. ఇక ఈమె కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన సత్య దేవి హైదరాబాద్ ఎస్ఆర్‌ నగర్‌ బల్కంపేట్‌ ప్రశాంత్‌కాలనీలో ఉంటూ తన ప్రియుడు సత్యవరప్రసాద్‌తో సహజీవనం చేస్తూ చివరికి ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఈ విషయం తన మొదటి భర్తకు తెలియడంతో వీరిద్దరూ తన భార్య కోసం గొడవ పడ్డారు తను నా భార్య అంటే నా భార్యని గొడవ పడటంతో సత్యదేవి మూడు నెలల గర్భవతి కాగా ఆమె ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో తన రెండవ భర్తసత్య వర ప్రసాద్ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య ఆచూకీ కోసం కేసు నమోదు చేశారు. వీరిద్దరు తమ భార్య కోసం గొడవపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.