ప్రత ప్రొడక్షన్స్ పతాకంపై భరత్ దర్శకత్వంలో ప్రముఖ వైద్యులు డా.శ్రీధర్ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, డా. టిపిఆర్ సంయుక్తంగా తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం `మేరా భారత్ మహాన్`. అఖిల్ కార్తిక్, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 22న హన్మకొండ ములుగు రోడ్ లోని వజ్ర గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డా.శ్రీధర్ రాజు ఎర్ర మాట్లాడుతూ…“సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ఓ సందేశాత్మక చిత్రంగా `మేరా భారత్ మహాన్` చిత్రాన్ని ముగ్గురు మిత్రులం కలిసి నిర్మిస్తున్నాం. గతంలో పలు సామాజిక అంశాలతో కూడిన చిత్రాలకు దర్శకత్వం వహించిన భరత్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది . ఆదివారం సాయంత్రం వరంగల్ లో పలువురు సినీ, పొలిటికల్ ప్రముఖుల నడుమ హన్మకొండ ములుగు రోడ్ లోని వజ్ర గార్డెన్స్ లో సాయంత్రం 6 గంటలకు ఆడియో రిలీజ్ చేస్తున్నాం. ఆగష్టు 15న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన డా.తాళ్ల రవి మాట్లాడుతూ…“దేశం బాగుపడాలంటే యువత సంకల్పించాలి. సమాజంలోని సమస్యలను అరికట్టే బాధ్యత వారిదే కాబట్టి నేటి యువతను చైతన్య పరిచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అలాగే అన్ని వర్గాలకు నచ్చే అంశాలను మా సినిమాలో పొందుపరిచాము“ అన్నారు.
మరో నిర్మాత డా.టిపిఆర్ మాట్లాడుతూ…“సందేశంతో పాటు మా చిత్రంలోని మంచి వినోదం కూడా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ముఖ్యంగా యువతకు మంచి సందేశం ఇస్తూ.. లవ్ స్టోరిని కూడా మిక్స్ చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఎర్రం శెట్టి సాయి డైలాగ్స్, లలిత్ సురేష్ మ్యూజిక్ , పెద్దాడమూర్తి సాహిత్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి“ అని అన్నారు
దర్శకుడు భరత్ మాట్లాడుతూ…“ సామాన్యులకు విద్య , వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుందనే సామాజిక స్పృహ తో పాటు, లవ్, కామెడీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాం. ఎర్ర శ్రీధర్ రాజు మంచి స్టోరీ ఇచ్చారు “ అన్నారు.
బాబు మోహన్ , తణికెళ్ల భరణి, గిరి బాబు, ఆమని , సుమన్ , నారాయణ రావు, ఎల్ బి శ్రీరాం, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరిః డా.శ్రీధర్ రాజు ఎర్ర, డైలాగ్స్ః యర్రంశెట్టి సాయి, పాటలుః చంద్రబోస్, పెద్దాడమూర్తి, చిలకరెక్క గణేష్, ఎడిటర్ః మేనగ శ్రీను, ఫైట్స్ః విజయ్, మేకప్ః యాదగిరి, పబ్లిసిటీ డిజైనర్ః రాంబాబు, స్టిల్స్ః వేణు, కాస్ట్యూమ్స్ః వల్లి, పిఆర్వోః రమేష్ బాక్సాఫీస్, ఆర్ట్ః పి.డేవిడ్, సినిమాటోగ్రఫీః ముజీర్ మాలిక్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః వల్లమాటి వెంకట్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ః కె.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరక్టర్ః విజయ్, అసోసియేట్ డైరక్టర్ః కృష్ణ ప్రసాద్, కో-డైరక్టర్ః రాజానంద్, కొరియోగ్రాఫర్స్ః స్వర్ణ, దిలీప్, సంగీతంః లలిత్ సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః సోమర్తి సాంబేష్, ప్రొడ్యూసర్స్ః డా.శ్రీధర్ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, డా. టిపిఆర్, స్ర్కీన్ ప్లే-దర్శకత్వంః భరత్.