కాంగ్రెస్ గండ్ర బాధితురాలిని పొల్లుపొల్లు కొట్టిర్రు (వీడియో)

కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. తనను మోసం చేశారంటూ రెండు నెలల కింద హన్మకొండలోని ఆయన నివాసం వద్ద ఆందోళన చేసిన విజయలక్ష్మీ అనే మహిళ ఇప్పుడు స్థానిక జయశంకర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టింది. ఆమె ఆందోళనతో కొంత మంది గండ్ర మనుషులు ఆమెను కొట్టి గుంజుకుపోయారు. వీడియో కింద ఉంది చూడండి. 

 

 

 

gandra victim video

గురువారం భూపాలపల్లిలోని జయశంకర్ చౌరస్తాలో విజయలక్ష్మీ ఆందోళనకు దిగింది. గండ్ర వెంకటరమణారెడ్డి తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడని ఆమె ఆరోపించింది. ధర్నా చేస్తున్న విజయలక్ష్మీని కొంత మంది గండ్ర వర్గానికి చెందిన మహిళలు అడ్డుకున్నారు. 

ఈ లింక్ పై క్లిక్ చేసినా వీడియో వస్తుంది… 

 

https://www.youtube.com/watch?v=pCwCxXAESMs&feature=youtu.be

 

ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినా ఆమె కదలకపోవడంతో కొంత మంది కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆమెను కొట్టి గుంజుకుపోయారు. అయినా కూడా విజయలక్ష్మీ అక్కడే బైఠాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పి పంపించారు. కేసు విచారణలో ఉందని న్యాయం జరుగుతుందని పోలీసులు చెప్పటంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.