Sharukh khan: వామ్మో ఆ వయసులోనే వారి పళ్ళు రాలగొట్టిన షారుక్ ఖాన్..!

Sharukh khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాలీవుడ్ స్టార్ హీరో గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షారుఖాన్ 2005వ సంవత్సరంలో ‘ద ఇన్నర్ అండ్ ఔటర్ వరల్డ్ ఆఫ్ షారుఖ్ ఖాన్’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది. బీబీసీ ఛానల్‌లో దాన్ని ప్రసారం చేశారు మొదటి పార్ట్ లో భాగంగా షారుఖాన్ బాల్యం విద్యాభ్యాసం గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. షారుఖాన్ చిన్నప్పుడు ఢిల్లీలోని ఎస్ఆర్కే స్థానిక ‘సెయింట్ కొలంబస్ స్కూల్’లో చదువుకున్నాడు.

ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ తన తదుపరి డాక్యుమెంటరీ కోసం బాలీవుడ్ బాద్షాగా పయనమైన షారుఖ్… స్కూలు ఆవరణంలో కాస్త సమయాన్ని గడిపి ఆ సమయంలో అతను గడిపిన క్షణాలను తన డాక్యుమెంటరీలో దర్శకనిర్మాతలు నిక్షిప్తం చేశారు. ఈ క్రమంలోనే షారుఖ్ చిన్ననాటి స్నేహితుడు షారుక్ ఖాన్ తో మాట్లాడుతూ ‘‘అప్పట్లో నువ్వు ‘మాడర్న్ స్కూలు’ విద్యార్థుల పళ్ళు రాలగొట్టారు కదా అని ప్రశ్నించారు ఆ మాటలు విన్న షారుఖాన్ తనలో తాను నవ్వుకుంటూ అవునని తల ఊపుతూ సమాధానం చెప్పారు.

ఇలా షారుక్ ఖాన్ స్కూల్లో చదువులో ఎంతో ముందంజలో ఉన్నప్పటికీ అల్లరి విషయంలో కూడా అలాగే ఉండేవాడని కొన్నిసార్లు స్కూల్లో తనకు మూర్ఛ వచ్చినట్టు పడిపోయి నటించేవాడిని అనే విషయాలను కూడా “ద ఇన్నర్ వరల్డ్ ఆఫ్ షారుఖ్ ఖాన్” డాక్యుమెంటరీలో బాద్షా తన చిన్న నాటి స్కూలు తాలూకూ ముచ్చట్లు మరిన్ని చెప్పాడు. ఇలా షారుక్ ఖాన్ తన చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని తన డాక్యుమెంటరీ రూపంలో మరోసారి గుర్తు చేసుకున్నారు.