Sharmila’s Husband : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో వైఎస్ జగన్ సోదరి షర్మిల భర్త అనిల్ భేటీ అవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ‘ఎప్పటినుంచో రాజకీయాల్లో వున్నాం..’ అని చెప్పారు, ‘రాజకీయాలు చేసేవాళ్ళు వేరే వున్నారు.. నాకు రాజకీయాలు తెలియవు’ అన్నారు. అంతలోనే, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించామనీ చెప్పారు. వెరసి బ్రదర్ అనిల్ కుమార్… పూర్తి గందరగోళం ప్రదర్శించారు మీడియా ముందు.
నిన్ననే వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంతలోనే షర్మిల భర్త అనిల్, ఉండవల్లి నివాసానికి వెళ్ళారు. సో, తెరవెనుకాల పెద్ద కథే నడుస్తోందన్నమాట.
చాలాకాలం తర్వాత రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు తన వద్దకు వచ్చారనీ, రాజశేఖర్ రెడ్డి అల్లుడు అనిల్ కుమార్‌ని కలుసుకోవడం ఆనందంగా వుందనీ, చాలా విషయాలు మాట్లాడుకున్నామనీ, ఆ విషయాలు మీడియాకి చెప్పబోననీ అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
సో, విషయం చాలా చాలా పెద్దదే అయి వుంటుంది. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ షర్మిల తన పార్టీని విస్తరిస్తారా.? లేదంటే, ఉండవల్లి విషయ పరిజ్ఞానం తమ పార్టీకి ఉపయోగపడుతుందని షర్మిల భావిస్తూ, ఈ క్రమంలోనే తన భర్తను ఉండవల్లి వద్దకు పంపించారా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.