Shanmukh Jaswanth Father: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో వీడియో సాంగ్స్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇలా గత ఐదు సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్న ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరితో చనువుగా ఉండటం వల్ల దీప్తి సునైనా బ్రేకప్ చెప్పినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీప్తి సునైనా ఈ విషయాన్ని వెల్లడించడంతో తనకు నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. తన నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని షణ్ముఖ్ జశ్వంత్ తన నిర్ణయాన్ని గౌరవించారు.ఇలా వీరిద్దరూ దూరంగా ఉండటంతో ఎంతో మంది అభిమానులు తిరిగి వీరిద్దరూ కలిస్తే ఎంతో బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ తండ్రి ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీరి రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయనలు త్వరలోనే కలుస్తారని, వారిద్దరికీ కొంత సమయం కావాలని ఈయన తెలిపారు. ఇప్పటివరకు దీప్తి సునయన మాత్రమే షన్నూకి బ్రేకప్ చెప్పింది. షన్ను ఎక్కడ తనకు బ్రేకప్ చెప్పలేదు.ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం కనుక అంతా శుభమే జరుగుతుందని అయితే కొంత సమయం కావాలని ఈ సందర్భంగా షణ్ముఖ్ యశ్వంత్ తండ్రి గురించి మాట్లాడుతూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరి షణ్ముఖ్ జస్వంత్ తండ్రి అనుకున్న విధంగానే వీరిద్దరు కలుస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.