భారీ ముల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న శంకర్

ఒకప్పుడు ఇండియా మొత్తం స్టార్ డైరెక్టర్ గా ఒక ఊపు ఊపిన శంకర్ గత కొంత కాలంగా తన స్థాయి కి తగ్గ సినిమాలు తియ్యట్లేదు. ‘రోబో’ తర్వాత వచ్చిన ‘స్నేనితుడు’, ‘ఐ’, ‘రోబో 2 .O’ నిరాశపరిచాయి.

ఇప్పుడు తాజాగా ఎలాగైనా హిట్ కొట్టాలని రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నాడు. అలాగే ఎప్పుడో ఆగిపోయిన ‘ఇండియన్ 2 ‘ షూటింగ్ కూడా మళ్ళీ మొదలుపెట్టాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శంకర్ కి మళ్ళీ మంచి రోజులు వచిన్నట్టే.

తాజా సమాచారం ప్రకారం శంకర్ ఒక భారీ ముల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్. వెంకటేశ్ అనే రచయిత చారిత్రక నేపథ్యంలో రాసిన ‘నేర్పాలి’ అనే నవల ఆధారంగా శంకర్ భారీ ఈ భారీ మూవీని ప్లాన్ చేస్తున్నాడట.

ఈ సినిమాలో హీరో సూర్యతో పాటు కన్నడ హీరో సుదీప్ కూడా మరో హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.