Janasena: సినిమాలలో నటించి జనసేన కోసం ఖర్చు చేశా…. పవన్ అసలు పట్టించుకోలేదు: షకలక శంకర్

Janasena: సినీ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం రాజకీయాలలోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. ఇక ఈయన రాజకీయాలలోకి రావడంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు ఈయనకు మద్దతుగా నిలిచారు. ఇక జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో తన మద్దతు తెలపడమే కాకుండా గత ఎన్నికలలో ఏకంగా పిఠాపురంలోనే ఉంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగిన వారిలో షకలక శంకర్ ఒకరు. ఈయన కూడా జనసేన పార్టీ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో కాకుండా 2019 ఎన్నికలలో జనసేన పార్టీ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షకలక శంకర్ తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

2019వ సంవత్సరంలో నేను కొన్ని సినిమాలలో నటించి సుమారు 7 లక్షల రూపాయల వరకు డబ్బు సంపాదించాను ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని భావించాను కానీ అదే సమయంలోనే మా ప్రాంతంలో పెద్ద ఎత్తున తుఫాను వచ్చింది తుఫాన్ రావడంతో భారీ నష్టాలు వచ్చాయి. అక్కడ బాధితులను పరామర్శించడం కోసం పవన్ కళ్యాణ్ వచ్చారు.. ఇక తుఫాన్ రావడంతో ఎంతోమంది తిండికి కూడా ఇబ్బందులు పడటంతో స్వయంగా నేను మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి భోజనాలను ఏర్పాటు చేయించాను.

ఇకపోతే అదే సమయంలో ఎన్నికల ప్రచారాలు కూడా మొదలు కావడంతో మిగిలిన డబ్బు మొత్తం ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం ఖర్చు చేశానని తెలిపారు.. ఇలా సినిమాలలో సంపాదించిన డబ్బు మొత్తం జనసేన పార్టీ కోసం ఖర్చు చేయడంతో నా భార్య నాతో మాట్లాడలేదు ఇక ఈ విషయంలో మా మామయ్య గారు కూడా నన్ను మందలించారు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డావు కనీసం పవన్ కళ్యాణ్ ఫోన్ అయినా చేశారా అంటూ మామయ్య నన్ను అడగడంతో ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకుండా పోయింది.

ఇక పవన్ కళ్యాణ్ గారిపై అభిమానంతోనే నేను పార్టీ కోసం ఇలా డబ్బు ఖర్చు చేశానే తప్ప ఆయన నాకు ఏదో ఇస్తారని ఆశించి డబ్బు ఖర్చు చేయలేదని షకలక శంకర్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం ఉన్న నేను ఆయనతో కలిసి సినిమాలలో నటించిన ఏ రోజు కూడా తనతో కలిసి ఫోటో దిగలేదు. అభిమానం అనేది మన మనసులో ఉండాలనీ షకలక శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.