తన డ్రీమ్ హౌజ్ చూపించిన ప్రముఖ సీరియల్ నటి అష్మిత.. ఇల్లు ఎంత అందంగా ఉందో?

ప్రస్తుత కాలంలో చాలామంది సెలబ్రిటీస్ ప్రతిరోజు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా యూట్యూబ్ వీడియోస్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇంట్లో, బయట జరిగే ప్రతి విషయం గురించి అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది సెలబ్రిటీలు తమ ఇల్లు ఎలా ఉందో కూడ వీడియోస్ షేర్ చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ సీరియల్ నటి అస్మిత కర్ణనిని కూడ తమ కొత్త ఇంటిని విశేషాలు అభిమానులతో పంచుకుంది.

సీరియల్ నటి అస్మిత ఎన్నో ప్రముఖ సీరియళ్లలో నటించి బుల్లితెర నటిగా మంచి గుర్తింపు పొందింది. అంతే కాకుండా ఆమె చాలా సినిమాలలో కూడా నటించింది. అయితే కొంతకాలంగా నటనకి దూరంగా ఉన్న అస్మిత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన లైఫ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అందరి నటి నటుల లాగే అస్మిత కూడ తన డ్రీమ్ హౌస్ టూర్ వీడియో షేర్ చేసింది. ఈ విడియోలో తమ ఇంటికి కోసం అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు చెప్పుకొచ్చింది.

అతి తక్కువ ప్లేస్ లో తమ ఇంటిని ఒక లక్సరీ హౌస్ గా తయారు చేసిన విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇంట్లో ప్రతి వస్తువు బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఉండేలాగా జాగ్రత్త పడినట్టు వివరించింది. ఇంట్లో తన కోసం, తన భర్త కోసం వేరు వేరు గదులు ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఇల్లు ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రతి మూలలో మొక్కలు పెట్టానని వివరించింది. అంతే కాకుండ తన కొత్త ఇంటిలో చిన్న హోం థియేటర్ కూడ పెట్టుకున్నామని వివరించింది. తన డ్రీమ్ హౌజ్ చుట్టూ వున్న అందమైన వ్యూని కూడా చూపించింది. అంతే కాకుండా వారి లాగా వారి పెట్ డాగ్ కూడ డ్రీమ్ హౌస్ లో చాల పీస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది.