Yash: సెన్సార్ సర్టిఫికెట్ పొందిన కేజీఎఫ్‌ – 2 … వన్ టైం ఎంత అంటే?

Yash: కన్నడ రాకింగ్ స్టార్ యష్ అంటే ఇప్పుడు కన్నడలోనే కాదు, దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన పేరు. మామూలు హీరోగా ఉన్న ఆయన్ని కేవలం ఒక్క సినిమా ఎక్కడో తీసుకెళ్లింది. భారీ ఇమేజ్‌ను, పాపులారిటీని తెచ్చిపెట్టింది. అదే కేజీఎఫ్. అప్పట్లో ఈ సినిమా ఓ రికార్డును క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా కన్నడ పరిశ్రమ గొప్పతనాన్ని తెలియజేసింది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమానే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా అలరించింది.

అయితే అంత భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘కే జి ఎఫ్: చాప్టర్ 2’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విషయం అందరికీ తెలిసిందే. చాప్టర్ 1 బాక్సాపీస్‌ను షేక్ చేయడంతో,, ఇప్పుడు చాప్టర్ 2 పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.
నిజం చెప్పాలంటే ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అంతకు ముందే సినిమా విడుదల తేదీని ప్రకటించినా పలు రీజన్స్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి ఈ చిత్ర విడుదలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంలో ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఇక ఈ సినిమా నిడివి 168 నిమిషాలు. అంటే 2 గంటల 48 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఏప్రిల్ 7నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ స్థాయిలో వ్యూస్‌ను కూడా సొంతం చేసుకుంది.