తెలుగు రాజకీయాల్లో వల్లభనేని వంశీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. టీడీపీ ఉన్న ఆయన సడన్ గా వైసీపీఈ మద్దతుగా మాట్లాడటం, లోకేష్ పై తీవ్ర విమర్శలు చెయ్యడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తిట్టడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడటం ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో ఎవ్వరు ఊహించని పరిణామాలు. అసలు వంశీకి టీడీపీలో ఏమి ఇబ్బందులు వచ్చాయో ఎవ్వరికీ తెలియదు కాదు ఆయన ఇప్పుడు వైసీపీకి మద్దతుగా, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భక్తుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం వల్లభనేని వంశీకి అస్సలు సహకరించడం లేదు. అక్కడ ఉన్న వైసీపీ నేతలు వల్లభనేని వంశీకి చుక్కలు చూపిస్తున్నారు. ఆయన వైసీపీలోకి రావడాన్ని మొదటి నుండి వైసీపీ లో ఉన్న నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
తన గోతిలో తానే పడుతున్న వంశీ
2019 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన అతికొద్ది మంది నాయకుల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఆయనకు టీడీపీ ఉన్న ప్రాధాన్యత గురించి అందరికి తెలుసు. జగన్ చేసే కక్ష్య సాధింపు రాజకీయాలకు భయపడొ లేక మరే కారణలో తెలియదు కానీ సడన్ గా టీడీపీని తిట్టడం మొదలు పెట్టారు. ఇలా తిట్టి వైసీపీ చెంతన చేరారు. వైసీపీలోకి వెళ్లిన వంశీ అక్కడి వైసీపీ నాయకులు తనకు స్వాగతం పలుకుతారని అనుకున్నాడు కానీ అక్కడ మొదటి నుండి వైసీపీని నడిపిస్తున్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావ్ వంశీకి చుక్కలు చూపిస్తున్నారు. వంశీ వైసీపీలోకి రావడాన్ని కూడా వాళ్ళు సహించడం లేదు. వంశీ మాత్రం తానే వైసీపీ ఇంచార్జ్ అని చెప్పుకుంటున్నారు కానీ జగన్ ఆ విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు వంశీకి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కేవలం వైసీపీ నాయకులు శత్రువులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్లడంతో వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు కూడా వంశీకి శత్రువులుగా మారారు. ఇవన్ని చూస్తుంటే వంశీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నట్టు అనిపిస్తుంది.
వైసీపీ నాయకుల పతకం అదుర్స్
ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు గన్నవర్మలో వైసీపీని నడిపించిన నాయకులకు కాకుండా వంశీకే అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆయననే వైసీపీ ఇంచార్జ్ గా నియమిస్తే ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు టీడీపీలోకి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారని సమాచారం. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చి, జగన్ వంశీకి టికెట్ ఇస్తే, వైసీపీ నాయకులు టీడీపీ నాయకులతో కలిసి వంశీ ఓటమికి కృషి చేసే విధంగా పతకాలు రచిస్తున్నారని సమాచారం. ఈ ఇద్దరి శత్రువుల ఆట నుండి వంశీ ఎలా బయటపడి తన రాజకీయ భవిష్యత్ ను నిర్మించుకుంటారో వేచి చూడాలి.