AP: జగన్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తే ఇబ్బందులే… కూటమిన్ హెచ్చరిస్తున్న సీనియర్లు?

AP: ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి నేతలపై విమర్శలు కురిపించారు అయితే తమ కార్యకర్తలను తమ నేతలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని మర్చిపోమని వారు సప్త సముద్రాల వెనుక దాగి ఉన్న పట్టుకొస్తాము అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఇక జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ జగన్ 2.0 ప్రారంభం అయిందని కార్యకర్తల కోసం జగన్ పని చేస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు చూస్తారు అంటూ కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ వార్నింగ్ ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు అంటూ కూటమి నేతలకు సీనియర్ నాయకులు సలహాలు ఇస్తున్నారు. జగన్ రెడ్డిని ఏమాత్రం తక్కువ వేసిన 2019 ఫలితాలను తిరిగి చూడాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక బలంతో పాటు కార్యకర్తల బలం పుష్కలంగా ఉంది తన తండ్రి ఏర్పాటు చేసిన ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 2024 ఎన్నికలలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి 40% ఓటు బ్యాంక్ సాధించారు. కూటమి నేతలు జగన్ మాటలను పూర్తిగా పక్కన పెట్టారు అంటే మరోసారి ఓటమిని చవిచూడాల్సి ఉంటుంది.

నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉండటంతో పాటు నేతలు కూడా ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా బలవంతులైన వారున్నారు. సామాజికవర్గం పరంగానూ, ఆర్థికంగానూ బలమైన నేతలుండటం ఫ్యాన్ పార్టీకి ప్లస్ పాయింట్ అని తెలియజేస్తున్నారు ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలియనిది కాదని తెలిపారు. ఇటు చంద్రబాబుకు, అటు పవన్ కల్యాణ్ కు తెలియంది కాదు. జగన్ అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి కూటమిని కంటిన్యూ చేయడం తప్ప మరోదారి వారికి లేదు.

జగన్ కు ఉన్న ఇమేజ్ ను కూడా తగ్గించాలనుకోవడం వృధా ప్రయాసే అవుతుందని, అందువల్ల మొన్నటి ఎన్నికల్లో పోలయిన ఓట్లు పక్కకు పోకుండా చూసుకోవడం, కూటమి పార్టీ క్యాడర్ ను కలసికట్టుగా ఉండాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పై వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధిని కూడా ప్రజలలోకి తీసుకువెళ్లాలి అంటూ కూటమి పార్టీ నేతలకు సీనియర్ నాయకులు సలహాలు ఇస్తున్నారు.