నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు దేశ రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించింది. అప్పట్లో ఉన్న చాలా పెద్ద పార్టీలకు చెక్ పెట్టింది. అయితే 2019 ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి దీన స్థాయికి చేరుకుంది. వైసీపీ నాయకుల దూకుడుకి టీడీపీ నేతలు తట్టుకోలేకపోయారు. ఎన్నికల్లో ఒదిన తరువాత కూడా టీడీపీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పార్టీలో ఉన్న చాలామంది నేతలు వైసీపీలోకి లేదా బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పుడు మరో కీలక నేత టీడీపీకి షాక్ ఇవ్వనున్నాడని సమాచారం. ఆయన ఎవరంటే అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవరావు.
కేశవరావుకు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది. టీడీపీపై విమర్శలు చేస్తున్న వారిపై గతంలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈయన 2019 ఎన్నికల్లో గెలిచిన అతి తక్కువ మంది నాయకుల్లో ఒకరు. కేశవరావు పార్టీకి ఎప్పటి నుండో నమ్మకంగా ఉంటున్నా కుడా టీడీపీ మాత్రం ఆయన పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించింది.
విచిత్రం ఏంటంటే పార్టీ గెలిచిన 1999లో ఆయన ఓడిపోయారు. పార్టీ ఓడిన 2004, 2009 ఎన్నికల్లో కేశవ్ గెలిచారు. రాష్ట్ర విభజన జరిగాక పార్టీ గెలిచిన 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఆయన మంత్రి పదవి ఆశలు నీరుగారిపోయాయి. అయినా చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు ఏపీలో పార్టీ పరంగా అనేక పనులకు వాడుకున్నారు. పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు కనీసం మూడేళ్ల తర్వాత అయినా మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. చివరకు ఇవ్వలేదు. ఇక గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.. మహామహులు ఓడిపోయారు. అయితే అనూహ్యంగా ఉరవకొండలో కేశవ్ గెలిచారు. అయితే చంద్రబాబు పార్టీకి మిగిలిన ఈ ఒకే ఒక్క కీలక పదవి అయిన పీఏసీ చైర్మన్ పదవిని కేశవ్‌కు కట్టబెట్టారు. ఈ పదవి కోసం పార్టీ తరపున గెలిచిన సీనియర్లలో చాలా మంది పోటీ పడినా బాబు మాత్రం కేశవ్‌కు ఇచ్చారు.
కేశవరావు పార్టీ ఎన్నో ఎంతో కష్టపడ్డాడు కానీ ఆయనను పట్టించుకోవడంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు విఫలమవుతున్నారు. ఓడిపోయినప్పుడు టీడీపీ తనను పట్టించుకోలేదనే బాధతో ఇప్పుడు ఆయన టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. గతంలో పార్టీలో జరిగిన అవమానాలను గుర్తుపెట్టుకొని కేశవరావు ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్న కేశవరావు వెన్నుపోట్లు పొడుస్తాడాని పేరున్న చంద్రబాబుకు వెన్నుపోడిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.