సీనియర్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ మృతి

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. కొన్నాళ్ల క్రితం సీనియర్ హీరో  కృష్ణం రాజు గారిని కోల్పోయిన పరిశ్రమ ఈ సారి ఇంకో దిగ్గజ ప్రొడ్యూసర్ ని కోల్పోయింది.

తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ మంచి పేరు, ప్రేక్షకుల్లో  లో క్రేజ్ దక్కించుకున్న వారిలో కాట్రగడ్డ మురారి ఒకరు. యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై చాలా హిట్తీ సినిమాలు తీసిన  మురారి (78) శనివారం రాత్రి చెన్నైలోని తన స్వగృహంలో హఠాన్మరణం చెందారు. మురారి గారు  1944, జూన్ 14 న విజయవాడ లో జన్మించారు.

సీతామహాలక్ష్మి, గోరింటాకు, జనకిరాముడు, నారి నారి నడుమ మురారి, సీతారామ కళ్యాణం, శ్రీనివాస కల్యాణం,జేెగంటలు వంటి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యి  నిర్మాతగా మురారి కి మంచి పేరు, గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

దర్శకుడవ్వాలనే కలతో  డాక్టర్ చదువు మానేసి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాడు మురారి. ,ఆ తర్వాత నిర్మాతగా స్థిరపడ్డారు. ఇక ప్రస్తుతం ఆయన మరణంతో సినిమా పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.

పలువురు సినీరంగ ప్రముఖులు మురారి అకాల మరణానికి చింతిస్తూ ఆయన పవిత్రాత్మకి శాంతి చేకూరాలని కోరుతూ నివాళులు అర్పిస్తున్నారు.