ప్రస్తుతం స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల బడ్జెట్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పుష్ప ది రైజ్ సినిమాకు బన్నీ 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలకు ప్రభాస్ 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
అయితే 1980 సంవత్సరం సమయంలో స్టార్ హీరోలు తక్కువ మొత్తం పారితోషికం తీసుకునే వాళ్లని సమాచారం. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ పారితోషికం 12 లక్షల రూపాయలు కాగా సీనియర్ ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ 40 లక్షల రూపాయలుగా ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో తీసుకున్న రెమ్యునరేషన్ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ కావడం గమనార్హం.
ఏఎన్నార్ ఒక్కో సినిమాకు 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా ఆయన సినిమాల బడ్జెట్ 30 లక్షల రూపాయలుగా ఉండేది. సూపర్ స్టార్ కృష్ణ 7 లక్షల రూపాయల పారితోషికం తీసుకునేవారు. అయితే ఆయన సినిమాల బడ్జెట్ మాత్రం 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉండేది. మరో స్టార్ హీరో శోభన్ బాబు ఒక్కో సినిమాకు 7 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునేవారు.
కృష్ణ సినిమాల బడ్జెట్, రెమ్యునరేషన్లతో సమానంగా శోభన్ బాబు సినిమాల బడ్జెట్లు, రెమ్యునరేషన్లు ఉండేవి. ఈ విధంగా అప్పట్లో స్టార్ హీరోలు రెమ్యునరేషన్ ను తీసుకునేవారు. సినిమాల ద్వారా శోభన్ బాబు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే అప్పట్లో లక్షల్లో రెమ్యునరేషన్లు ఉండగా ఇప్పుడు ఆ రెమ్యునరేషన్లు కోట్ల రూపాయలు కావడం గమనార్హం.