Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మది నెమ్మదిగా బయటపడుతున్నాయి. మారణహోమం సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి కొత్తరూపు దాల్చింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో తరుముకొస్తుంది. దేశంలో రోజురోజుకి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాలలో ఒమిక్రాన్ చాపకింద నీరులాగా పాకుతుంది. అత్యంత జనసాంద్రత కలిగిన మహా నగరం ముంబై. ఇప్పుడు నెమ్మదిగా ముంబై లో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యం లో మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన శిక్షలు అమలు చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధించింది. ప్రజలు గుంపు గుంపులుగా తిరగకూడదని.. ఆదేశాలని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు విధించి, చట్టపరమైన తీసుకుంటామని ముంబై ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, దేశంలో కొత్తగా నిన్న ఒమిక్రాన్ కేసులు 7 నమోదు అయ్యాయి. అలా మొత్తానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నేపథ్యం మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ, రేపు నగరం లో 144 సెక్షన్ అమలు చేసింది.