Narendra Chowdary: ఎన్టీవీ నరేంద్ర చౌదరిని స్కాంలో ఇరికిస్తున్నారా..!? ప్రత్యర్ధుల పనేనా..?

Narendra Chowdary: ఒక వ్యక్తి ఎదుగుదలను ఓర్వేలేని వారు ఏదొకరకంగా వారిని తొక్కేయడానికి సిద్ధపడతారు. మీడియా రంగంలో అనేక చానెల్స్ తో దూసుకెళ్తున్న ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిపై అక్రమ కేసులు పెట్టి అయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. ఇటివల వెలుగులోకి తెచ్చిన ‘జూబ్లీ హిల్స్ స్కాం..’లో నరేంద్ర చౌదరిని గారి పేరును తెర మీదకు తెచ్చారు. మొన్నటి వరకూ నరేంద్ర చౌదరి అధ్యక్షుడిగా కొనసాగిన జూబిలీ హిల్స్ కోపరేటివ్ సొసైటీ ప్యానెల్ ఇటివల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది.

జూబిలీ హిల్స్ cooperative society

ఈ ఎన్నికల్లో నరేంద్ర చౌదరి పోటీ చేయలేదు. అయన బలపరిచిన ప్యానెల్ ఓడిపోయింది. కొత్త అధ్యక్షుడిగా టీవీ5 మేనేజింగ్ డైరక్టర్ రవీంద్రనాథ్ బొల్లినేని ఎన్నికయ్యారు. ఎన్నికల ముందువరకూ లేని స్కాం ఇప్పుడు తెర మీదకు రావడం వెనుక  కొందరి హస్తం ఉందనే అంటున్నారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి పైన గత ప్యానెల్ సెక్రెటరీ అయిన టి.హనుమంతరావు పైన భూ కబ్జా కింద కేసు పెట్టడం జరిగింది. గతంలో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఈ లావాదేవీని ఇప్పుడు స్కాం పేరుతో బయటకు తీసుకురావడంపై విమర్శలూ వస్తున్నాయి.

ఇదంతా ఆయనపై బురద చల్లే ప్రయత్నమే అంటున్నారు. నరేంద్ర చౌదరి వ్యక్తిగా , సామాజిక సంస్కర్త గా సేవా దృక్పధం జోడించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో వార్తా ప్రసారాల్లో ఎన్టీవీ, ప్రప్రథమ తెలుగు భక్తి ఛానల్ గా.. భక్తి టీవీ, మహిళల కోసం వనిత టీవీని స్థాపించి అనేక మందికి మార్గదర్శకులయ్యారు. ఈ ఛానల్స్ గురించి చెడుగా చెప్పేందుకు వెబ్ సైట్ లు, యూట్యూబ్ ఛానల్స్ ను ఉపయోగిస్తున్నారని సమాచారం.

ఇంత జరగడానికి రాజకీయ కారణాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీవీని చంద్రబాబు పక్కన పెట్టారు. చానెల్స్ ప్రసారాన్ని అడ్డుకున్నారనే విమర్శలూ వచ్చాయి. టీవీ5 ఎప్పుడూ చంద్రబాబు పక్షాన ఉంటుంది. ప్రస్తుత అంశంలో టీవీ5 ప్యానెల్ గెలుపొంది, ఎన్టీవీ ప్యానెల్ ను ఇబ్బందిపెట్టే అంశంలో ఈ కోణం కూడా ప్రస్తావించదగినదే అంటున్నారు. వీటన్నింటికీ నరేంద్ర చౌదరి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందంటున్నారు.