జర్నలిస్టులపై బాబు మంగళవారం మాటలు!

2019 ఎన్నికల ఫలితాలొచ్చినప్పటి నుంచి మొదలు.. బాబుపై దెబ్బ మీద దెబ్బ పడుతున్న సంగతి తెలిసిందే. అందుకేనేమో ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వాన్ని విమర్శించడానికి పాలనాపరంగా సరైన సమస్య కనిపించకుండా పోతుందనే ఆవేదన. ఈ సమయంలో ఏపీలో అకాల వర్షాలు వచ్చాయి.. రైతులకు పంట నష్టం వాటిల్లింది.. వెంటనే బాబు గోదావరి జిల్లాల్లో వాలిపోయారు. తడిసిన ధాన్యాన్ని చేతుల్లోకి తీసుకుని ఫోటోలు దిగారు. ఈ సమయంలో మీడియాపై తన అక్కసు వెళ్లగక్కారు బాబు.

టీవీ9, ఎన్ టీవీ ల సంగతి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానంటూ చిందులేశారు. దీంతో ఆన్ లైన్ వేదికగా బాబును ఒక ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. తన పర్యటనను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై చంద్రబాబు అక్కసు ఏమిటో అర్ధం కావడం లేదని అంటున్నారు నెటిజన్లు. “అధినేతలు తీసుకునే నిర్ణయాలకు – ఉద్యోగాలు చేసుకునే జర్నలిస్టులకు ఏమి సంబంధం” అన్న ఇంగితం బాబుకు లేకపోయిందే అని విచారిస్తున్నారు.

తనకు నచ్చని టీవీ ఛానల్స్ అధినేతలపై నేరుగా అక్కసు చూపించే ధైర్యం లేని వారే… ఇలా ఛానల్ ఏదైనా తమ తమ వృత్తులకు న్యాయం చేసే జర్నలిస్టులపై అక్కసు ప్రదర్శిస్తారని ఎద్దేవా చేస్తున్నారు. ఇక్కడ బాబు గ్రహించాల్సింది ఒకటే. “చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలను కర్రలు తీసుకుని కొడితే అది కరెక్టా..?” అది ఎంత తప్పో… “మీడియా అధిపతులు తీసుకున్న నిర్ణయాలకు, ఎంచుకున్న పాలసీలకు తగినట్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులపై బాబు ఆగ్రహించడం” కూడా అంతే తప్పు!

మరి ఈ లెక్కన అధికారంలో ఉన్న వైఎస్ జగన్… తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు రాస్తుందని ఈనాడు – ఆంధ్రజ్యోతి, టీవీ 5 జర్నలిస్టులను ఏమి చేయాలి? జగన్ ఎప్పుడూ నేరుగా రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అంటూ డైరెక్టుగా ఆ మీడియా ఛానల్స్ అధిపతులను టార్గెట్ చేసి విమర్శలు చేస్తారు. అంతే తప్ప తన కవరేజ్ కి వచ్చిన ఆయా మీడియా ప్రతినిధులను విమర్శించరు కదా. జర్నలిస్టులపై తన అక్కసు చూపించరు కదా. ఈ ఇంగితం బాబుకు ఎందుకు లేదు?

దీంతో… నాలుగు పదుల అనుభవం, ఏడుపదుల వయసు ఉంటే సరిపోదు… పద్దతిగా ఉండాలని, హుందాగా ప్రవర్తించాలని, విమర్శించాలనుకుంటే మీడియా అధిపతులను విమర్శించుకోవచ్చు కానీ… ఇలా జర్నలిస్టులను బెదిరించకూడదని ఈ సందర్భంగా బాబు సూచిస్తున్నారు నెటిజన్లు.

tv9,ntv ల కి చంద్రబాబు వార్నింగ్ | Chandrababu Warning To TV9,NTV | Telugu News Channels | YS Jagan