మీరు ఏదైనా బ్యాంక్ లో ఖాతా తెరవాలని అనుకుంటున్నారా? అయితే.. మీకు ఒక గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే ఉచితంగా మీకు అకౌంట్ ను అందిస్తోంది.
అందులోనూ ఎస్బీఐ బ్యాంక్ అంటే మామూలు విషయం కాదు. ఆ బ్యాంక్ లో అకౌంట్ తెరిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఎటువంటి డబ్బులు కట్టకుండా.. ఉచితంగా డాక్యుమెంట్లు కూడా లేకుండా వెంటనే అకౌంట్ తెరుచుకోవచ్చు.
దీని కోసం చేయాల్సింది ఏం లేదు. 18 ఏళ్లు పైబడి ఉంటే చాలు. దగ్గర్లోని బ్రాంచ్ కు వెళ్లి బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ స్మాల్ అకౌంట్ ను ఓపెన్ చేయొచ్చు. ఈ ఖాతాకు మీరు ఎటువంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. రూపాయి కట్టాల్సిన పనిలేదు. కాకపోతే ఈ అకౌంట్ తెరిచే ముందు మీకు ఇతర ఏ బ్యాంకుల్లో అకౌంట్ ఉండకూడదు.
అయితే.. ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా… ఈ అకౌంట్ కు కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ ఖాతా తెరిచిన వాళ్లు.. తమ ఖాతాలో 50 వేలకు పైన డబ్బులు వేయడానికి వీలు లేదు. అలాగే.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల విలువ లక్ష రూపాయలకు మించకూడదు. అలాగే ఒక నెలలో 10 వేలకు పైన లావాదేవీలు నిర్వహించే వీలు ఉండదు. ఈ అకౌంట్ నుంచి కేవలం నెలకు 4 సార్లు మాత్రమే డబ్బు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ అకౌంట్ తీసుకున్న ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డును బ్యాంక్ అందిస్తుంది. అయితే.. అకౌంట్ పరిధిని పెంచుకోవాలంటే.. కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించి.. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ గా మార్చుకోవచ్చు.