నిరుద్యోగులకు అలర్ట్.. భారీ వేతనంతో మ్యూచువల్ ఫండ్ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల!

sbi account can be opened without any documents

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. తాజాగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సూరత్ లో రిలేషన్ షిప్ మేనేజర్ జాబ్ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయగా అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని సులువుగా ఈ ఉద్యోగం పొందవచ్చు.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీకి ఎంపికవుతారో వాళ్లు మార్కెటింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. ఒకే ఒక ఉద్యోగ ఖాళీ ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీకి పోటీ కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ పూర్తి చేయడంతో పాటు కనీసం రెండేళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

ఈక్విటీ అండ్‌ డెట్ మార్కెట్‌ గురించి అవగాహన ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హోమ్ పేజ్ లో కెరీర్ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రాడక్ట్ లను విక్రయించాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరిగే విధంగా జాబ్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.