దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 107 కంట్రోల్ రూమ్ ఆపరేటర్, ఆర్మర్ ఉద్యోగ ఖాళీల కోసం ఎస్బీఐ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హతతో ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా 2023 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు
చేసుకోవచ్చు.
మొత్తం 107 ఉద్యోగ ఖాళీలలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలు 89 ఉండగా ఆర్మర్ ఉద్యోగ ఖాళీలు 18 ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ఆపరేటర్ ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా ఆర్మర్ ఉద్యోగాలకు 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉండనుందని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు లేకపోవడం వల్ల ఈ ఉద్యోగ ఖాళీలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 47,920 రూపాయల వేతనం లభించనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా 2023 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ లేదా డిసెంబర్ లో ఆన్ లైన్ పరీక్ష జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.