స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. రాత పరీక్ష లేకుండా జాబ్స్!

ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 868 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేసింది. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలగనుంది.

కనీసం 30 సంవత్సరాల సర్వీస్ ను పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 58 సంవత్సరాల వయస్సు నిండిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేష ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించి తుది ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూలలో అభ్యర్థులు సాధించిన మార్కులను బట్టి తుది ఎంపిక జరుగుతుంది. www.sbi.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజును చెల్లించి ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ నుంచి ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్బీఐ వరుస జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ ఎంతోమందికి ప్రయోజనం చేకూరుస్తోంది. ఎక్కువ మొత్తంలో వేతనాలను ఎస్బీఐ అందిస్తోంది. ఈ బ్యాంక్ లో ఖాతాదారుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.