దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్సీ కేటగిరీ కింద 01, ఓబీసీ కేటగిరీ కింద 01, జనరల్ కేటగిరీ కింద 01 భర్తీ చేయనుండగా ఏకంగా మూడు జాబ్ నోటిఫికేషన్లను భర్తీ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఎంతగానో మేలు జరగనుంది. 27 నుంచి 37 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు విషయంలో మినహాయింపు ఉంది. https://sbi.co.in/web/careers/current-openings లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ నెల 29వ తేదీ లోగా ఫీజును చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగ ఖాళీల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ మాత్రం భారీ స్థాయిలో ఉండనుందని సమాచారం.