ఒకేరోజు 81 మందిని పొట్టన పెట్టుకున్న సౌదీ అరేబియా!

మామూలుగా మనదేశంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాటికి కొన్ని రకాల శిక్షలు ఉంటాయి. ఇక కొన్ని కొన్ని సందర్భాలలో పెద్దపెద్ద తప్పులకు మరణ శిక్షలు తప్పవు. కానీ ఇతర దేశాలలో చిన్న తప్పు చేసినా కూడా కాళ్లు, చేతులు నరుక్కోవడం, చంపుకోవడం వంటివి చేస్తుంటారు అక్కడ ప్రభుత్వాలు.

అలా ఇప్పటికి సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఘోరాలను చూశాం. ఇదిలా ఉంటే తాజాగా సౌదీఅరేబియాలో ఏకంగా 81 మందిని ఉరితీశారు. ఇంతకు వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటంటే.. చనిపోయిన వాళ్ళల్లో అల్ ఖైదా, ఐసిస్, యెమెన్ హౌతీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలియడంతో కొందరు మహిళలను, పిల్లలను చంపినట్లు తేలింది. దీంతో వీరందరిని తాజాగా ఉరితీశారని తెలిసింది.