Sameera: ప్రాణం లేని బిడ్డను కడుపులో మోసాను…. కన్నీళ్లు పెట్టుకున్న నటి?

Sameera: సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సన ఒకరు. ఈమె ఇప్పటికీ పలు సినిమాలలో సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈమె బాటలోనే తన కోడలు సీనియర్ ఆర్టిస్ట్ సమీరా సైతం ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు పొందారు. ఇక పలు సినిమాలలో కూడా నటించి మెప్పించిన ఈమె ఓ కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరించారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సమీరా 2019లో నటి సన కుమారుడిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ దంపతులకు 2021 వ సంవత్సరంలో అర్హన్ అనే కుమారుడు జన్మించారు. ఇక పెళ్లి తర్వాత సమీరా కెరియర్ కాస్త పక్కన పెట్టి ఫ్యామిలీతోనే తన విలువైన సమయాన్ని గడుపుతున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక వీడియోని షేర్ చేశారు. 2023వ సంవత్సరంలో తాను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యానని తెలిపారు. అయితే తను మరోసారి కన్సీవ్ కావడంతో తన కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషించారు. ఇక తన బాబు కూడా తన కడుపులో ఉండే బిడ్డతో మాట్లాడుతూ ఉండేవాడని ఈమె ఎమోషనల్ అయ్యారు. తరచూ చెకప్ కి వెళ్తే డాక్టర్లు కూడా బేబీ గ్రోత్ బాగుందని చెప్పేవారు. అయితే ఓసారి జనరల్ చెకప్ కి వెళ్ళగా బేబీ గ్రోత్ ఆగిపోయిందని హార్ట్ బీట్ కూడా లేదని చెప్పారు.

Naa Pregnancy Journey | It Hasn't Been Easy | This Is Why We Never Spoke About It | Sameera Sherief

డాక్టర్లు చెప్పిన ఆ మాట విని ఒక్కసారిగా తాను కుప్పకూలిపోయానని తెలిపారు. ప్రాణం లేని బిడ్డను దాదాపు 12 వారాలపాటు నేను మోసానని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ ఘటనతో తన కుటుంబ సభ్యులకు కూడా ఎంతో బాధపడ్డారని సమీరా వెల్లడించారు. అయితే ఈ ఘటన 2023లో జరగగా ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇందులో ఈమె హాస్పిటల్ చెకప్ కి వెళ్ళినప్పటి క్లిప్స్ అలాగే బేబీ స్కానింగ్ చేయించినటువంటి క్లిప్స్ అన్నింటిని కూడా షేర్ చేశారు. ఇక తన బిడ్డను కోల్పోవడం గురించి సమీరా ఎమోషనల్ కావడంతో ఈమెకు ధైర్యం చెబుతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.