Samantha’s Romance : సమంతతో విజయ్ దేవరకొండ రొమాన్స్: షాకవుతున్నారంతా.!

Samantha’s Romance : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సమంత ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కాగా, ఈ కాంబినేషన్  విషయంలో నెట్టింట హాట్ హాట్ చర్చ నడుస్తోంది. అందుకు కారణం సమంత, విజయ్ దేవరకొండ కన్నా వయసులో పెద్దది కావడమేనట.

విచిత్రంగా వుంది కదూ. ఆల్రెడీ సమంత, విజయ్ దేవరకొండతో జత కట్టిన సంగతి నెటిజన్లు మర్చిపోతున్నారు కాబోలు. ‘మహానటి’ కోసం ఈ జంట రెట్రో వేషం కట్టారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు.? అంటే, కథ పరంగా ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఎక్కువగా వుండబోతున్నాయట.

సమంతతో రౌడీ రొమాన్స్ కాస్త ఎబ్బెట్టుగా వుంటుందేమో అంటూ రౌడీ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఈ కాంబినేషన్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయినా, గతంలో ఎంతమంది ముద్దుగుమ్మలు, తమ కన్నా వయసులో చిన్నవారైన హీరోలతో నటించలేదు చెప్పండి.

ఆ లిస్టులో అక్కినేని అందగాడు అఖిల్ కూడా వున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కోసం తన కన్నా వయసులో పెద్దదైన పూజా హెగ్దేతో జత కట్టాడు అఖిల్. చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే. సో, ఈ చర్చ అర్ధం పర్ధం లేనిదని మరో వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, శివ నిర్వాణ, సమంతతో ‘మజిలీ’ సినిమా తెరకెక్కించాడు. హిట్ కొట్టాడు. అలా ఈ లవ్ స్టోరీపై కూడా అంచనాలు బాగా వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సెన్సిటివ్ లవ్ స్టోరీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.