Samantha: నెటిజెన్ ట్విట్ కు గట్టిగా కౌంటర్ వేసిన సమంత

Samantha gave strong counter to netizen on twitter

Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ ఇప్పుడు మంచి ఊపులో ఉంది. విడాకుల తర్వాత ఏమాత్రం డీలా పడకుండా వరుసగా సినిమాలు కమిట్ అవుతూ అందర్నీ షాక్ కి గురిచేస్తుంది. ఇక ఇటీవల కెరీర్ లో తొలిసారిగా అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’లో “ఊ అంటావా మావా… ఉ ఉ అంటావా” అంటూ ఐటెం సాంగ్ చేసి కుర్రకారు మతుల్ని గింగరాలు తిప్పేస్తుంది. పుష్ప మూవీ విజయంలో సమంత పాత్ర కూడా ఉందని అనుకోవచ్చు.

ఇక, సోషల్ మీడియాలోఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సమంతకు తాజాగా ట్విట్టర్ లో ఒక అనూహ్యమైన అనుభవం ఎదురైంది. ఒక వ్యక్తి తన గురించి అత్యంత దారుణంగా చేసిన పోస్ట్ కు తనదైన రీతిలో హుందాగా కౌంటర్ వేసింది. “ఒక జెంటిల్మన్ నుండి టాక్స్ కట్టనవసరం లేకుండా 50 కోట్లు తీసుకున్న సెకండ్ హ్యాండ్ ఐటెం” సమంత అని కమరాలీ దుకందర్ అనే వ్యక్తి ట్విట్ చేసాడు. దీనికి సమంత జవాబిస్తూ… ‘నీ ఆత్మను దేవుడు ఆశీర్వదించాలి’ అని పేర్కొంది.

ఇలానే ట్రోల్ చేసేవారికి సమంత గట్టిగా కౌంటర్లు వేసి నోరు మూయించిన సందర్భాలున్నాయి. దాంతో దెబ్బకి ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానులు సమంతకు అండగా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా హిందీ, తెలుగు, తమిళ భాషలలో పలు క్రేజీ సినిమాలను ఓకే చేసింది.