Samantha: సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్..? బాబోయ్ ఇది పెద్ద ప్లానింగే..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మళ్లీ ప్రేమలో పడ్డారని బీటౌన్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా సింగిల్‌గా ఉంటూ, కెరీర్ మీదే దృష్టి పెట్టిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఫేమస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంతకు కొత్త లవ్ స్టోరీ మొదలైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల సమంత-రాజ్ కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు లీక్ కావడం, ఎక్కడికీ వెళ్లినా వీళ్లిద్దరూ జంటగా కనిపిస్తుండటం ఈ రూమర్స్ కి బలాన్నిస్తున్నాయి. అందులో సమంత భుజంపై రాజ్ చేయి వేసి, ఇద్దరూ నవ్వుకుంటూ కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఇదే సమయంలో మరో ఆసక్తికర సమాచారం ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదే సమంత రెండో పెళ్లి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. వీరి పెళ్లి ఆగస్టులోనే ఉంటుందంటూ టాక్ మొదలైంది. కానీ సమంత మాత్రం అక్టోబర్ నెలే బెస్ట్ అని భావిస్తోందట. అసలే సమంత-చైతూ పెళ్లి కూడా అక్టోబర్ 6న జరిగింది. అదే డేట్ లో రాజ్‌తో పెళ్లి చేసుకుని మాజీ భర్తకు షాక్ ఇవ్వాలనేది సమంత ప్లాన్ అని టాక్.

ఇదీ చదవండి: ఎట్టకేలకు మౌనం వీడిన క్రిష్… వీరమల్లుపై సంచలన పోస్టు!

సమంత కెరీర్ వైపుగా కూడా పూర్తి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇకపై సాధారణ కథలు కాదు, డిఫరెంట్, చాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని క్లారిటీ ఇచ్చింది. ‘తొందరపడకూడదని ఇప్పుడే అర్థమవుతోంది’ అని కూడా సామ్ చెబుతోంది. ఇక ప్రొడ్యూసర్‌గా కూడా సమంత రూటు మార్చేసింది. రీసెంట్‌గా ‘శుభం’ సినిమా నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలు ఇలా చేతి నిండా ప్రాజెక్టులు ఉండగా… రెండో పెళ్లి వార్త మరింత హాట్ టాపిక్ అయ్యింది.

ఇదీ చదవండి: కళ్లకు కాటుక పెట్టుకోవడం.. వెనుక అసలు కారణం ఇదే..!

ఎన్ని సమస్యలు ఎదురైనా, సమంత లైఫ్‌కి తిరిగి ట్రాక్‌లోకి వస్తోంది. గతం పాఠం, భవిష్యత్తు ఆశ అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఫ్యాన్స్ లోకూ కొంత ధైర్యం ఇస్తున్నాయి. మరి ఈ గాసిప్ నిజమా? లేక సినిమాల కోసమే హడావుడా? ఇంకా స్పష్టత రాలేదు కానీ… సమంత కొత్త జీవితం స్టార్టు చేస్తుందా.. లేదా అన్నది చూడాలి.