సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే రికార్డులు బడ్డలవడానికి సిద్ధంగా ఉంటాయి. అందునా ఈద్ సీజన్ అయితే వసూళ్ల జాతరే. కానీ ఈసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా భాయ్ సినిమా థియేటర్లలోకి వచ్చే వీలు లేకుండా పోయింది. అందుకే నిర్మాతలు సినిమాని జీ5 ఓటీటీకి విక్రయించేశారు. మంచి లాభాలకే సినిమా అమ్ముడైంది. ఇక జీ ఓటీటీ పెట్టిన పెట్టుబడిని వెనక్కు రాబట్టడానికి పే పర్ వ్యూ పద్ధతిని అవలంభించింది. ఈ పద్దతిలో సినిమాను చూడాలంటే డబ్బులు చెల్లించి చూడాలి.
ఈ పద్ధతి బాగా వర్కవుట్ అయింది. భాయ్ సినిమా అనేటప్పటికి అభిమానులు ఎగబడి జీ5 సబ్స్క్రిప్షన్ కొనేశారు. డబ్బులు కట్టి సినిమాను చూసేశారు. 24 గంటలు కూడ గడవకముందే సినిమా 42 లక్షల వ్యూస్ దక్కించుకుంది. మామూలుగా సినిమా హాళ్లలో వచ్చి ఉంటే మొదటిరోజు 100 కోట్లు కొల్లగొట్టి ఉండేది సినిమా. అయితే ఓటీటీలో కూడ ఇదే స్థాయి బిజినెస్ చేసింది సినిమా. థియేటర్ బిజినెస్ అయితే ఎంటర్టైన్మెంట్ టాక్సులు, ఎగ్జిబిటర్స్, థియేటర్ల షేర్ ఇవ్వాలి. కానీ ఓటీటీలో ప్రతి రూపాయి జీ5 సంస్థకే వెళుతుంది. దీంతో నిన్న ఒక్కరోజే జీ సంస్థకు 100 కోట్లు వెనక్కి వచ్చాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి భాయ్ దెబ్బకు 100 కోట్లు గల్లంతయ్యాయి.