Salman Khan: మరో కొత్త కారు కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సల్మాన్ ఖాన్. ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. అలా కమర్షియల్ యాడ్స్ సినిమాలలో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు సల్మాన్ ఖాన్. కాగా బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో విలాసవంతమైన జీవితం గడిపే వారిలో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు.

ఖరీదైన గడియారాలు మంచి మంచి డిజైనర్ దుస్తులు టాప్ ఎండ్ కార్లు ఇలా చాలా విషయాలలో వార్తలు నిలుస్తూ ఉంటారు సల్మాన్ ఖాన్. ఇలా ఆయన వాడే ప్రతి ఒక్క వస్తువు లక్ష నుంచి కోట్లలో ఉంటుందని చెప్పాలి. కాగా ఇప్పటికే ఎన్నో కోట్లు విలువ చేసే కార్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ ఖాన్ వద్ద చాలా కార్లు కలెక్షన్లు ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు మరొక కారు తోడైంది. తాజాగా మరొక లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు సల్మాన్ ఖాన్. అదే మెర్సిడెస్ మేబాచ్ GLS 600. ఇటీవల సల్మాన్ ఖాన్ ఈ లగ్జరీ SUV ముందు ప్యాసింజర్ సీట్లో కూర్చుని కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఫ్యాన్స్ విండ్‌షీల్డ్‌ పై 2024 రిజిస్ట్రేషన్ స్టిక్కర్‌ ను గమనించారు. అంటే ఇది కొత్తగా రిజిస్టర్ చేయబడిన కారు అని అర్థం. SUV బోల్డ్ లుక్, శక్తివంతమైన ఉనికి సల్మాన్ వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఈ GLS 600 బేస్ ధర దాదాపు రూ. 3.39 కోట్లు ఉంటుందని సమాచారం. ఒకవేళ బుల్లెట్ ప్రూఫ్ అయితే, ధర రూ. 5 కోట్లకు మించి ఉండవచ్చని సమాచారం ఈ కారు ధర తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఒక్క కారు ధర ఏకంగా అన్ని కోట్ల అంటూ నోరెళ్ల బెడుతున్నారు.