‎Prabhas: సలార్ 2 సినిమా ఇప్పట్లో రాదా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా!

‎Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం చేతిలో అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఇకపోతే ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

‎ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి మిగిలిన సినిమా షూటింగ్లో పనిలో బిజీ బిజీ అవునున్నారు ప్రభాస్. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా షూటింగ్‌ కూడా చేస్తున్నారు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్ట్‌ ల తర్వాత సలార్ 2 శౌర్యాంగ పర్వంపై దృష్టి పెట్టబోతున్నారట. కానీ ఫౌజీ మూవీ తర్వాత సలార్ 2 షూటింగ్‌ కు ప్రభాస్ పెద్ద గ్యాప్ తీసుకోబోతున్నాడట డార్లింగ్ ప్రభాస్. ఇదే వార్త ప్రస్తుతం టాలీవుడ్ జోరుగా వినిపిస్తోంది. సలార్ మూవీ ఫస్ట్ పార్ట్‌ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించినప్పటికీ, సీక్వెల్‌ కు సంబంధించి ప్రభాస్ నుంచి ఎలాంటి స్పష్టమైన అప్‌డేట్ రాకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తోంది.

‎సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్‌ తో డ్రాగన్ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. సలార్ 2ను త్వరగా సెట్స్‌ పైకి తీసుకెళ్లాలని హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ షెడ్యూల్‌ లో డ్రాగన్ ఆ తర్వాత అల్లు అర్జున్‌ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. దీంతో సలార్ 2 కాస్త ఆలస్యం అవుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదని చెప్పాలి. ఎందుకంటే సలార్ 2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.