“సలార్” మామూలుగా ఉండదట.. ఇంటర్నేషనల్ లెవెల్లో అంటున్న యూనిట్ టెక్నీషియన్.!

Salaar : ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ మూవీ లవర్స్ కూడా ప్రభాస్ తన రేంజ్ కి తగ్గ హిట్ సినిమా కొట్టాలని ఎదురు చూస్తున్నారు. అయితే అది డెఫినెట్ గా రాబోయే సినిమాలు “ఆదిపురుష్” చిత్రాలతో అందుకుంటాడు అని ఎదురు చూస్తున్నారు. అయితే వీటిలో దేనికదే సెపరేట్ కాన్సెప్ట్ సినిమాలు. ముఖ్యంగా అంతా ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ “సలార్” కోసం వైట్ చేస్తున్నారు.
మరి ఈ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో లేటెస్ట్ గా ఈ సినిమా టెక్నిషన్ అయినటువంటి భువన్ గౌడ తెలపడం వైరల్ గా మారింది. కేజీఎఫ్ అలాగే సలార్ కి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ టెక్నిషన్ సలార్ కోసం మాట్లాడుతూ ఈ సినిమా అయితే..
కేజీఎఫ్ సినిమాల కన్నా మూడు, నాలుగింతలు అదిరే రేంజ్ లో వుంటుంది అని సినిమాని చాలా కొత్తగా ప్రశాంత్ తీస్తున్నాడని ఆ థీమ్ గాని ఏక్షన్ గాని వేరే లెవెల్లో ఉంటాయని తాను చెబుతున్నాడు. అలాగే ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది అని అది చూసాక ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుంది అని తాను అదిరే కామెంట్స్ చేసాడు. దీనితో ఈ మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ మరియు సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.