జగన్ ఢిల్లీ టూర్.. ‘సాక్షి’ హిట్ అంటే.. ‘జ్యోతి’ ఫట్ అంటోంది 

ఏపీ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత పెద్దదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  కొమ్ముకాసే తత్వానికి బాగా అలవాటుపడిన తెలుగు మీడియా రెండు ప్రధాన పార్టీల నడుమ ఏనాడో చీలిపోయింది.  ఏ మీడియా సంస్థ వారు వారికి అనుకూలమైన పార్టీలు వంతపాడుతూ జనంతో ఆడుకుంటున్నారు.  ఒక విషయాన్ని వారొక   కోణంలో చెబితే వీరొక కోణంలో చెబుతూ చూసేవారిని ఏది నమ్మాలో తెలియని అయోమయంలో పడేస్తున్నారు.  అసలు జనం తమ ఓటు ఎవరికి వేయాలనేది   కూడ వీళ్ళే చెప్పేస్తుంటారు.  మీడియా ప్రభావంతోనే ఆంధ్రాలో అధికార పార్టీలు డిసైడ్ అవుతాయంటే అర్థంచేసుకోవచ్చు మీడియా పనితనం ఎలా ఉందో. 

ఇక్క పాలకవర్గం వైసీపీకి సాక్షి ఉంటే ప్రతిపక్షం టీడీపీకి ఆంధ్రజ్యోతి ఉంది.  ఈ రెండూ ప్రతి క్షణం కొట్టుకుంటూనే ఉంటాయి.  జగన్ గురించి, ఆయన పాలన్ గురించి సాక్షిలో ఆకాశానికెత్తేస్తుంటే జ్యోతిలో పాతాళానికి తొక్కుతుంటారు.  చంద్రబాబు నాయుడు గురించి జ్యోతి గొప్పల బాకాలు ఊడితే   సాక్షిలో తిట్ల   దండకం నడుస్తుంది.  ఇది రెండు ప్రధాన పార్టీల అనుకూల మీడియాల్ వైఖరి.  తాజాగా సీఎం జాగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.  ప్రస్తుత రాష్ట్రం ఉన్న కష్టాల్లో, నెలకొన్న పరిస్థితుల్లో ఈ టూర్ చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది.  సీఎం ఢిల్లీ వెళితే రావాల్సినవన్నీ తీసుకొచ్చేస్తామని అంటూ ఉంటారు కాబట్టి ఈ టూర్లో ఏం తెఛ్చి ఉంటారో చూడాలని జనం ఆసక్తిగా ఉన్నారు.

Jagan likely to meet Amit Shah in Delhi on Friday

సాక్షి పత్రికలో యథావిధిగా సీఎం హస్తిన టూర్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టు కథనాలు వచ్చాయి.  పోలవరంకు నిధులతో పాటు జీఎస్టీ బకాయిలు, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ , పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఏపీకి ప్రత్యేక హోదా, 3 వేల కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు చెల్లింపు, పోలవరం నిధుల రీయింబర్స్మెంట్ లాంటి అన్ని కీలక విషయాల్లో హామీలు తీసుకుని వచ్చినట్టు, ఈ టూర్ మూలంగా సగం సమస్యలు సాల్వ్ అయినట్టు చెప్పుకొచ్చారు.  ఇతర వైసీపీ అనుకూల మీడియాలో అయితే అమరావతి భూముల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ మీద సీబీఐ విచారణ కోరడం కూడ చేశారని చెబుతున్నారు.  కానీ ఎల్లో మీడియాలో మాత్రం జగన్‌కు హెచచ్రికాలు, క్లాసులు పడినట్టు రాసుకొచ్చారు.  

NewsSting - Jagan requests Shah to "soften his heart' of AP Special Status

 

న్యాయ వ్యవస్థపై బురదజల్లే పనులు ఏవీ చేయవద్దని అమిత్ షా చెప్పినట్టు, అమిత్‌ షాను కలుసుకున్న జగన్‌ కేవలం 15 నిమిషాల్లోనే బయటికి వచ్చారని, జగన్ మాట్లాడిన ప్రతి అంశం మీద ముందుగానే సమాచారం తెప్పించుకున్న అమిత్ షా  కోర్టు తీర్పులు, వాటి పరిశీలనలో ఉన్న అంశాల విషయంలో కేంద్రం కలుగజేసుకోలేదని, ఆయా అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశించలేమని చెప్పినట్టు, దీంతో జగన్ నిరాశ చెందినట్టు, అసలు ఢిల్లీ టూర్ పూర్తిగా ఫ్లాప్ అన్నట్టు రాశారు.  మరి ఈ టూర్ ద్వారా ఏవైనా ప్రయోజనాలు వనగూరుతాయేమోనని చూస్తున్న జగన్ ఈ రెండు బయాస్డ్ మీడియాల్లో ఎవరి మాటలు నమ్మాలో తెలీక ఎప్పటిలాగే ఉసూరుమంటున్నారు.