జనసేన తన పార్టీ అన్న విషయాన్ని పవన్ మర్చిపోయినట్టున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో కొన్ని విషయాలు బయటపెట్టారు. 2024 ఎన్నికల్లో పొత్తులకు సంబంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ చేసిన వ్యాఖ్యల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయంగా సీరియస్ గా ఉన్న వాళ్ళు ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నారని.. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ విశ్లేషకుడి పొత్తులపై ఆప్షన్లు ఇచ్చారని అన్నారు. ఇక జనసేన పార్టీ తన పార్టీ అనే విషయం పవన్ మర్చిపోయినట్టుగా ఉన్నారని వెటకారం చేశారు. చంద్రబాబు వ్యూహం పవన్ వల్లే వేస్తున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు.