రెబల్ ఎంపీ రఘురాంపై వైకాపా అదిష్టానం అనర్హత వేటుకు సిద్దమైన సంగతి తెలిసిందే. శుక్రవారం వైకాపా ఎంపీలంతా ప్రత్యేక విమానంలో ఢీల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తో సమావేశం కానున్నారు. అనంతరం ఆయనకు రఘురాం అనర్హత వేటు విషయంపై లేఖ అందించనున్నారు. ప్రభుత్వంపై రఘురాం చేసిన వ్యాఖ్యల వెనుక కారణలను స్పీకర్ కు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుడు, కేంద్ర కార్యాలయ సమన్వయ కర్త సజ్జల రామకృష్ణా రెడ్డి రఘురాంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రఘురాం ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్ని తిప్పికొటారు. వైకాపాలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదన్నారు.
ఏ పార్టీ నేతకైనా, ఎలాంటి వారికైనా సీఎం జగన్ ని కలిసే అవకాశం ఉంటుందన్నారు. పార్టీలో ఎవరూ జగన్ ని కలవడానికి అభ్యంతరం చెప్పరన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారిని వైకాపా ఎందుకు వదులుకుంటుదన్నారు. వైకాపాలో ఎలాంటి కమ్యునికేషన్ సమస్యలు లేవన్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు పార్టీ పనులు, ఒత్తిడి కారణంగా సీఎంని కలిసే అవకాశం ఉండకపోచ్చు అన్నారు. ఇక సజ్జల ప్రభుత్వంపై ఉద్దేశ పూర్వకంగా ఆరోపణల్ని చేసారన్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎలా మాట్లాడారో? మీడియా సాక్షిగా అందరూ చూసారన్నారు. రఘురాంపై అనర్హత వేటుకే సిద్దమయ్యామని సజ్జల పేర్కొన్నారు. రేపు ఢిల్లీ వెళ్తోన్న నేపథ్యంలో కాసేపటి క్రితమే సజ్జల ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇప్పటికే రఘురాంపై వేటు ఖాయమని వస్తోన్న వార్తల నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసింది.