నేను ఏమి కొన్నా కూడా అమ్మకి తెలిసిపోతుంది.. అసలు విషయం చెప్పిన సాయి పల్లవి…!

ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి సాయి పల్లవి. ఈ సినిమాలో సహజమైన అందంతో అభినయంతో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో సాయి పల్లవికి తెలుగు,తమిళ భాషలలో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈమె నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. వృత్తి రీత్యా డాక్టర్ అవ్వాల్సిన సాయి పల్లవి అనుకోకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇటీవల సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి విజయం అందుకుంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ తో కూడుకున్న ఇండస్ట్రీ. కానీ సాయి పల్లవి గ్లామర్ కి దూరంగా ఉంటూ తన సహజ అందంతో, వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి రానా హీరోగా నటిస్తున్న విరాట పర్వం సినిమాలో నటించింది. ఈ సినిమ షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకి సిద్దంగా ఉంది. తాజాగా సాయి పల్లవి ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించిన చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా సాయి పల్లవి తను ఎలా యాక్టర్ అయిందో చెప్పుకొచ్చింది. ఈ సంధర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ..మా ఇంట్లో మొదటి నుండి డబ్బు విషయంలో ఇబ్బంది లేదు. నేను సినిమాలు చేసినప్పటి నుండీ అన్ని అమ్మే చూసుకుంటుంది. ఇప్పటికీ కూడా నేను ఏమైనా కొన్నా కూడ ఓటిపి అమ్మకి వెళ్తుంది. నాకు వారి పెర్మిషన్ తీసుకొని ఏవైనా కొనటం చిన్నప్పటి నుండి అలవాటు. ఇప్పటికీ కూడా అలాగే చేస్తుంటాను. ఒక్కోసారి అమ్మ కి ఎక్కువ శ్రమ పెట్టకుండా నా పని నేను చేసుకుందాం అనుకుంటా. కానీ చేయలేను. అన్నీ అమ్మే చూసుకుంటుంది. అంటూ చెప్పుకొచ్చింది.