పొట్టి బట్టలు వేసుకోవడం తప్పులేదు అంటున్న సాయి పల్లవి..

సినీ ఇండస్ట్రీలో గ్లామర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో గ్లామర్ ఏ మాత్రం తగ్గదని చెప్పాలి. పొట్టి పొట్టి బట్టలతోనే వాళ్ల అందాలను చూపిస్తూ ఉంటారు. కొందరు హీరోయిన్స్ మాత్రం పొట్టి బట్టలను అసలు యాక్సెప్ట్ చెయ్యరు. అందులో సాయిపల్లవి ఒకరు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది. సినిమాల్లో గ్లామర్ షో లేకుండా స్టార్ హీరోయిన్ అయ్యారని.. హీరోయిన్ అంటే పొట్టి బట్టలు వేసుకుంటారు.. మీరు ఎందుకు వాటి వ్యతిరేకం అని అడగడంతో.. అలాంటిదేమీ లేదని.. పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అనడం లేదంటూ.. కానీ ఎదుటి వారి చూసే చూపుల్లో మార్పు వచ్చినప్పుడు తనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అని తెలిపింది.