పాపం సాయి పల్లవి కవరింగ్ వర్కవుట్ అవ్వట్లేదాయె

Sai Pallavi Missed Mega Chance But | Telugu Rajyam

హీరోయిన్ సాయి పల్లవి, ‘భోళా శంకర్’ సినిమాలో నటించాల్సి వుంది.. అదీ, మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో. కానీ, ఆ సినిమాకి ఆమె ‘నో’ చెప్పింది. మామూలుగా అయితే, ఇలాంటి విషయాల్లో హీరోలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తారు. అయితే, అక్కడున్నది మెగాస్టార్ చిరంజీవి. ‘నా సినిమాని ఒప్పుకోనందుకు హ్యాపీ.. ఎందుకంటే, సాయి పల్లవితో డాన్స్ చేయాలనుకుంటాను.. ఆమె అంత మంచి డాన్సర్.. భవిష్యత్తులో ఆమె హీరోయిన్‌గా నా సినిమాలో నటిస్తుంది.. సాయి పల్లవి చెల్లెలి పాత్ర వద్దన్నందుకు నాకు హ్యాపీగానే వుంది..’ అంటూ చిరంజీవి చమత్కరించారు. ‘అయ్యయ్యో అదేమీ లేదు.. రీమేక్ సినిమాలంటే భయం..’ అని సాయి పల్లవి కవర్ చేసింది.

మరోపక్క, ‘రీమేక్ సినిమాలంటే ఇష్టం లేదని కాదు.. కానీ, ఆయా పాత్రల్లో అంతకు మించిన నటనా ప్రతిభను చాటుకోగలనా.? ఆయా పాత్రలకు న్యాయం చేయగలనా.? అన్న భయంతోనే చిరంజీవి సినిమాకి నో చెప్పాను..’ అంటూ సాయి పల్లవి తాజాగా వివరణ ఇచ్చుకుంది.  సాయి పల్లవి వివరణలో స్పష్టత కనిపించడంలేదు. ఆమె కన్ఫ్యూజ్ అవుతోంది ఎందుకో. ఆ విషయం ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించేస్తోంది. ఇదిలా వుంటే, ‘భోళా శంకర్’ సినిమాలో సాయి పల్లవి వదిలేసుకున్న అవకాశాన్ని కీర్తి సురేష్ చేజిక్కించుకున్న విషయం విదితమే. నటిగా సాయి పల్లవి కంటే కీర్తి సురేష్ చాలా పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంది. స్టార్ డమ్ పరంగా చూసుకున్నా అంతే. మరి, కీర్తి సురేష్ చెయ్యగా లేనిది, సాయి పల్లవికి ఏంటి అభ్యంతరం.? అదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మంచి అవకాశాల్ని వదులకుంటుండడం వల్లే సాయి పల్లవి స్టార్ హీరోయిన్.. అన్పించుకోలేకపోతోందన్న వాదనలూ లేకపోలేదు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles