ఏంటి.. ఆ సీన్ కోసం సాయి పల్లవి ఒక రోజంతా ఏం తినలేదట.!

ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర తన టాలెంట్ తో అలరిస్తున్న సూపర్ టాలెంటెడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఒకామె. తన అందం అభినయంతో పాటుగా తన పేరు చెప్తే తన డాన్స్ కూడా అందరికీ గుర్తొస్తుంది. అయితే సాయి పల్లవి చాలా డెడికేషన్ కలిగిన హీరోయిన్ కూడా అని మరోసారి ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు తెలిసింది. సాయి పల్లవి చాలా సహజంగా నటిస్తుంది అని అందరికీ తెలిసిందే.

కానీ నటన కోసం తాను చాలా కష్టపడుతుంది అనే అంశం ఇప్పుడు రివీల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు సినిమాల్లో ఎప్పుడో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రం “విరాట పర్వం” కూడా ఒకటి. రాణా దగ్గుబాటి హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన నక్సల్ నేపథ్యం సినిమా ఇది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దర్శకుడు వేణు ఒక సీన్ కోసం సాయి పల్లవి ఆ రోజు మొత్తం అసలు ఏమి తినకుండా యాక్ట్ చేసింది అని తెలిపాడు.

తాను ఒక సీన్ కోసం వివరించగా అందులోని లోతుని భావాన్ని ఆమె అర్ధం చేసుకుంది అని ఆ సీన్ లోని ఇంటెన్సిటీ రావాలి అంటే అలా చెయ్యాలి అని ఆమె భావించి అందుకోసం ఆరోజు మొత్తం ఆమె ఏం తినకుండా యాక్ట్ చేసింది అని ఆమె తన యాక్టింగ్ పట్ల అంత డెడికేట్ గా ఉంటుంది అని వెల్లడించారు. దీని బట్టి సాయి పల్లవిని కేవలం డాన్స్ లోనే గొప్పగా అనుకుంటున్న వారికి ఇలా డేడికేటివ్ గా ఉండి కూడా సమాధానం ఇచ్చింది అని చెప్పాలి.