Sai pallavi: సినీ నటి సాయి పల్లవి చాలా సామాన్యమైన పక్కింటి అమ్మాయి తరహాలో తన జీవనాన్ని సాగిస్తుంది. ఈమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా సాదాసీదాగా తన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతానంటూ ఎన్నో సందర్భాలలో తెలిపారు. ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందారు దాదాపు సాయి పల్లవి చేసిన సినిమాలలో 90% ఆమెకు మంచి సక్సెస్ అందించాయి. సినిమా కథలో కంటెంట్ ఉంటేనే ఈమె సినిమాలకు కమిట్ అవుతారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఇటీవల అమరన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం సినిమాలో సీత పాత్రలో కనిపించబోతున్నారు.
ఇక తెలుగులో నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కానుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన విషయంలో అభిమానులు చూపించే ఉత్సాహంపై కాస్త కోపం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిలోనూ వారికి నచ్చే అంశాలు నచ్చని అంశాలు కూడా ఉంటాయి అలాగే కొన్ని భయాలు కూడా వెంటాడుతూ ఉంటాయని తెలిపారు..
నేను ఏదైనా బయటకు వెళ్తే కొంతమంది టక్కున వారి ఫోన్ బయటకు తీసి ఫోటోలు తీస్తూ ఉంటారు. అలా ఫోటోలు తీస్తే కనుక నాకు చాలా కోపం వస్తుంది. నేను కూడా మనిషినే కదా అని సాయి పల్లవి తెలిపారు. ఆ సమయంలో నేను ఒక చెట్టునో, అందమైన భవనాన్నో కాదు కదా ఒక జీవం ఉన్న మనిషిని కదా అనిపిస్తుంది. అలా వారి ఇష్టానుసారంగా ఫోటోలు తీయకుండా దగ్గరికి వచ్చి మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే ఎంత బాగుంటుంది.
ఇక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనని గమనిస్తూ ఉన్నప్పుడు నాకు కాస్త భయం వేస్తుందని సాయి పల్లవి తెలిపారు. అంతేకాకుండా నేను హద్దులు మీరి ఆలోచనలు చేస్తూ ఉంటానని ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండడం కోసం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాను అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.