Sai Dharam Tej: టాలీవుడ్ హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం అడపాదడపా సినిమా లలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు సాయి తేజ్. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో సాయి తేజ్ కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే.. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ విభాగానికి ఆయన దాదాపుగా రూ. 5లక్షల విరాళం ఇచ్చారు.
తాజాగా గురువారం హైదరాబాద్ వేదికగా జరిగిన హైదరాబాద్ ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ సమ్మిట్ 2025కు అతిథిగా హాజరైన సాయి దుర్గతేజ్ పోలీసు అధికారులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనసరిగా హెల్మెట్ ధరించండి. 2021 సెప్టెంబరులో రోడ్డు ప్రమాదానికి గురయ్యా. రెండు వారాల పాటు కోమాలో ఉన్నాను.. ఇప్పుడిది నాకు పునర్జన్మ. ఇదంతా నేను సానుభూతి కోసం చెప్పడం లేదు.
A true safety pledge 😃✨
Supreme Hero @IamSaiDharamTej donates ₹5 Lakhs to the Police Department, HYD at the Traffic Summit 2025, supporting pedestrian & road safety🚦👏
His gesture stands as a powerful reminder that star power can drive social change❤️🔥@HCSC_Hyd #Saidurghatej pic.twitter.com/BjbLnActW8— KasaRajuPatel (@KasaRajuPatel_) September 18, 2025
ఆ రోజు హెల్మెట్ ధరించాను కాబట్టే ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను. బైక్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా మామయ్య, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరచూ గుర్తు చేసేవారు అని చెప్పుకొచ్చాడు సాయి దుర్గ తేజ్. ఈ సందర్బంగా సాయి తేజ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించారు.
