AP: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. ఇక ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీ సీనియర్ దివంగత నాయకుడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మే 27 నుంచి 29 వరకు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక మూడో రోజులో భాగంగా నేడు మహానాడు కార్యక్రమం జరుగుతుంది.
ఇక ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఈ కార్యక్రమం మొదటి రోజు మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీకి సుమారు 21.53 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు వేదిక పైన తెలియజేశారు. అలాగే దాతలు ఎవరైనా సరే ఆన్లైన్లో కూడా విరాళాలను అందజేయవచ్చు అంటూ చంద్రబాబు తెలిపారు.
ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇచ్చిన వారందరి పేర్లను వరుసగా చంద్రబాబు నాయుడు చదివి వినిపించారు. ఇలా తెలుగుదేశం పార్టీకి విరాళం అందించిన వారిలో సినీన నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కూడా ఉన్నారు. ఈయన కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఏకంగా 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు స్వయంగా చదివి వినిపించారు. ఇక ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కేవలం నాగ వంశీ మాత్రమే విరాళంగా డబ్బునిచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈయనను స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది కూడా విరాళాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది కూటమి ప్రభుత్వానికి చాలా సానుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు రావచ్చని తెలుస్తుంది.