విషాదం : “కేజీయఫ్” లో మాన్స్టర్ నటుడు మృతి..డీటెయిల్స్ ఇవే.!

kgf movie monster : రీసెంట్ గా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో మన సౌత్ ఇండియా సినిమా నుంచి వెళ్లిన రెండు చిత్రాలు 2000 కోట్లకి పైగా మార్కెట్ ని చేసేశాయి. ఆ చిత్రాలే ఒకటి మన తెలుగు నుంచి వచ్చిన భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కాగా కన్నడ నుంచి “కేజీఎఫ్ చాప్టర్ 2” సినిమా.

రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్ లు తెరకెక్కించిన ఈ సాలిడ్ సినిమాలు భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్నాయి. కానీ ఇప్పుడు అనుకోని విధంగా మంచి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి కేజీఎఫ్ యూనిట్ కి విషాద వార్త వినిపించింది.

ఈ సినిమాలో మీడియా వ్యక్తి అనంత నాగరాజ్ కి ఇన్ఫార్మర్ గా రాకీ కోసం సమాచారం ఇచ్చే నటుడు సినిమాలో చెప్పిన మాన్స్టర్ డైలాగ్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ నటుడు పేరే మోహన్ జునేజా. అయితే తాను ఈరోజు తెల్లవారు జామున అనుకోని విధంగా కన్ను మూశారట.

గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తాను ఈరోజు బెంగళూరులో చికిత్స పొందుతూ తన 54వ ఏట కన్నుమూశారట. దీనితో చిత్ర యూనిట్ కూడా తీవ్ర విషాదం వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని తమ కేజీఎఫ్ కుటుంబం కోరుకుంటుంది అని తెలిపారు.