Roja: ఏ క్షణమైన రోజా అరెస్ట్ కావచ్చు… సంచలన వ్యాఖ్యలు చేసిన శాప్ ఎండీ రవి నాయుడు!

Roja: వైసీపీ మాజీమంత్రి ఫైర్ బ్రాండ్ రోజా పరిస్థితి ఎటు కాని విధంగా ఉందని చెప్పాలి ఈమె గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారు ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా కొన్ని కోట్లలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి.

ఇక ఈమె మంత్రిగా కొనసాగుతూనే తన సొంత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. రోజా మంత్రి కావడంతో తన కుటుంబ సభ్యులందరూ కూడా జీవితంలో మంచిగా సెటిల్ అయ్యారని వాదన కూడా వినిపించింది.మంత్రిగా ఉన్న సమయంలో రోజాపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అధికారం అండతో ఇష్టారీతిగా నోరేసుకుని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేసిన రోజా పరిస్థితి ఆమె రాజీకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడబోతోందా అంటే అవునని తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయామంలో అధికారం అండతో పెద్ద ఎత్తున అక్రమాలు దందాలకు పాల్పడిన రోజా ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి కూడా అనుచిత ఆరోపణలు చేస్తూ వార్తలలో నిలిచారు. ఇకపోతే తాజాగా రోజా చేసిన అక్రమాలు అవినీతి గురించి నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిపై తెలుగుదేశం యువనేత, శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి డబ్బు సొంతం చేసుకున్నారని తెలిపారు. క్రీడా పరికరాల కోనుగోళ్లలో 119 కోట్ల రూపాయలకు పైగా నిధులను పక్కదోవపట్టించారని రవి నాయుడు ఆరోపించారు. అంతేకాకుండా తిరుమల దర్శన టికెట్లలో కూడా కోట్లాది రూపాయలను దోచుకున్నట్లు ఈయన ఆరోపణలు చేశారు.

ఈ అవినీతి, అక్రమాల వ్యవహారంలో అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని ఏ క్షణమైనా వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా అరెస్ట్ కావడం పక్కా అని రవి నాయుడు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.