కొందరు పిల్లలని చూస్తే వారు పిల్లలు కాదురా బాబు పిడుగులు అనిపిస్తుంది. చలాకీతనం, టాలెంట్, పనిపై ఏకాగ్రత చూసి చాలా ఆశ్చర్యమేస్తుంది. 9 ఏళ్ళ పిల్లాడు యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ముక్కున వేలసుకుంటున్నారు. ఈ ఏడాది మరి కొద్ది రోజులలో ముగియడానికి వస్తున్న నేపథ్యంలో యూట్యూబ్ ద్వారా 2020లో అత్యధిక ఆదాయం సంపాదించిన టాప్ 10 లిస్ట్‌ని ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో ర్యాన్ కాజీ అనే 9 ఏళ్ల బుడతడు టాప్‌లో ఉన్నారు. అతను ఈ ఒక్క సంవత్సరంలోనే యూ ట్యూబ్ ద్వారా 29.5 మిలియిన్ డాలర్లు(సుమారు రూ.217 కోట్లు) సంపాదించాడు.
ర్యాన్ కాజీకి మొత్తం 9 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఇందులో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల గురించి ఎక్కువగా వివరణ ఇస్తంటాడు. 2015 మార్చి నుండే ర్యాన్ ఈ పని చేస్తుండగా, అతనికి ఉన్న మొత్తం 9 చానెళ్లలో ర్యాన్ వరల్డ్ అనే చానెల్‌కు అత్యధికంగా 4.17 కోట్ల మంది సబ్ స్కైబర్లు, 1,220 కోట్ల వ్యూస్ ఉన్నాయి.టాప్ జాబితాలో ర్యాన్ చోటు దక్కించుకోవడం మూడోసారి. అతను ఎంతో మంది ప్రముఖులను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు.
ఫోర్బ్స్ కథనం ప్రకారం ర్యాన్ చానెల్ మొత్తంగా 5 వేల వరకు ర్యాన్-థీమ్ ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తోంది. కేవలం వీటి ద్వారానే ఈ పిల్లోడు 200 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.1,470 కోట్లు) సంపాదిస్తున్నాడు. నికెలోడియోన్ అనే టీవీ సిరీస్ కోసం కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు.దీనితో ఎంత డీల్ కుదుర్చుకున్నాడు అనే దానిపై క్లారిటీ లేదు. అయితే యూట్యూబ్ ద్వారా ఈ బుడతడు కోట్లు సంపాదిస్తున్నప్పటికీ, సోషల్ మీడియా బ్రౌజ్ చేయాలన్నా, నెట్ ముందు కూర్చోవాలన్నా తల్లిదండ్రులతో కొద్ది సేపు వాగ్వాదం తప్పదు