యూట్యూబర్ మౌనిక రెడ్డి పెళ్ళి డేట్ ఫిక్స్… వరుడి బాక్ఫ్రౌండ్ ఏంటో తెలుసా…?

ప్రస్తుతం యువతీ యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ అని నిరూపించుకుంటూ పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు అందుకొని నటీనటులుగా గుర్తింపు పొందారు. ఇలా యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్ లలో నటించి ఫేమస్ అయిన మౌనిక రెడ్డి సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. సూర్య అనే వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన మౌనిక రెడ్డి భీమ్లా నాయక్, ఓరి దేవుడా వంటి ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి గుర్తింపు పొందింది.

ఇప్పుడిప్పుడే సినిమాలలో మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న మౌనిక రెడ్డి పెళ్లికి సిద్ధమయ్యింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వివరాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన స్నేహితుడు సందీప్ కూరపాటిని పెళ్లాడబోతుంది ఈ మౌనిక . గత కొంతకాలంగా వీళ్ళు ప్రేమించుకుంటున్నారని అదే విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 17 ,18 వ తేదీల్లో గోవాలో వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరగబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా మౌనిక రెడ్డి అభిమానులకు తెలియజేసింది .

తన స్నేహితుడయిన సందీప్ కూరపాటిని అనే వ్యక్తిని మౌనిక రెడ్డి పెళ్లాడబోతుంది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకోవటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా వెరీ పెళ్లి డేట్ ని కూడా పిక్స్ చేసినట్లు సమాచారం. డిసెంబర్ 17 ,18 వ తేదీల్లో గోవాలో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం చాలా ఘనంగా జరగబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కొన్ని కోట్లకు వారసుడని అంతేకాకుండా అతను సింగర్ గా కూడా మంచి గుర్తింపు పొందాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా మౌనిక రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.